Information All
I will Give useful Information and GK Knowledge.
Tuesday, January 17, 2017
Sunday, January 08, 2017
Friday, January 06, 2017
జవాహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)
జవాహర్ లాల్ నెహ్రూ
జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ
గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత
రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
బాల్యం
నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలో జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు
వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల
సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక
భవంతిలో ఉంటూ, దుస్తుల విషయంలో హావాభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య
నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లములో కూడా తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగింది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరుతో పిలిచేవారు.
జీవిత చరిత్ర
![]() |
| Nehru-Gandhi family (1927) |
నేటి ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్
రాణిల ప్రథమసంతానంగా నెహ్రూ జన్మించారు.[3] నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణ వంశానికి
చెందినది. మోతీలాల్ చాలా సంవత్సరాల క్రితం అలహాబాద్‌కు తరలి వెళ్లి న్యాయవాద వృత్తిలో
విజయవంతమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర
పోరాటంలో అయన చురుకైన సభ్యుడు. నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి పండిట్
మరియు కృష్ణ- ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన,
ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికి హిందీ, సంస్కృతాలు నేర్పించడంతో
పాటు భారతదేశానికి చెందిన సారస్వత గ్రంథాలలో పునాది వేయబడింది. మోతిలాల్ తన కుమారుడు
ఇండియన్ సివిల్ సర్వీసులో అర్హత పొందాలని ఆశించి, యువ జవహర్ లాల్ ను ఇంగ్లాండ్ నందుగల
హార్రోకి పంపారు. జవహర్ లాల్ తన పాఠశాల సిలబస్ ను కష్టమైనది గాను, మరియు నివాస షరతులు
అనుకూలంగా లేనివి, భరింప శక్యం కానివిగా భావించి హర్రోలో గల పాఠశాల జీవితం ఆనందించలేకపోయారు.
ఐనప్పటికీ, నెహ్రూ పాఠశాల విద్య పూర్తి చేసి, 1907 లో కేంబ్రిడ్జిఎంట్రన్స్ పరీక్ష
వ్రాసి జీవశాస్త్ర అభ్యసనకు ట్రినిటీ కళాశాలకు వెళ్లారు. జవహర్ లాల్ తనట్రిపోస్లో రెండవ
స్థానంలో నిలిచి 1910 లో పట్టా పొందారు. విశ్వవిద్యాలయంలోని స్వేచ్ఛాయుత వాతావరణం ఆయనను
ఇతర కార్యక్రమాలు నిర్వహించేటట్లు ప్రోత్సహించి, సాధారణ దృష్టికోణంపై కీలక ప్రభావాన్ని
చూపింది. పిమ్మట అయన అక్టోబర్, 1910 లో న్యాయ అభ్యసనకు ఇన్నెర్ టెంపుల్ లో భర్తీ అయ్యారు.
హర్రో మరియు కేంబ్రిడ్జిలందు అభ్యసించాలనే నిర్ణయం న్యాయ విద్య యందు జవహర్ లాల్ కు
ఉన్న ఆకర్షణవల్ల కాక వారి తండ్రి ఆజ్ఞానుసారం జరిగింది. జవహర్ లాల్ 1912 లో చివరి పరీక్ష
ఉత్తీర్ణుడై అదే సంవత్సరంలో ఇన్నెర్ టెంపుల్ లో న్యాయ వాద వృత్తిని చేపట్టారు. దాని
వెంటనే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే, రాజకీయాలు,
ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకత్వంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామం ఆయనను ఆకర్షించింది.1919
లో జలియన్ వాలా బాగ్ లో ఆందోళనకారులపై ఆంగ్లేయుల ఊచకోత తరువాత, నెహ్రూ తీవ్ర ప్రతీకారంతో
తన శక్తులన్నీ స్వాతంత్ర్య సంగ్రామానికే కేటాయించారు.మొదట తన కుమారుని రాజకీయ యోచనను
సందేహించినా, తరువాత స్వాతంత్ర్య సముపార్జనకు కాంగ్రెస్ ప్రయత్నాలలో మోతీలాల్ కూడా
పాల్గొన్నారు. అతి త్వరగా నెహ్రూ, గాంధీ గారి నమ్మినబంటుగా గుర్తింపు పొందారు. ఆయన
ఉద్యమాలు, ఆహింసాయుతమైనవే అయినప్పటికీ, ఆయన జీవితకాలంలో తొమ్మిది సంవత్సరాలు కారాగారంలో
ఉండేటట్లు చేసాయి. కారాగారంలో ఉన్న కాలంలో నెహ్రూ, "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ(1934),
తన "జీవిత చరిత్ర " (1936), మరియు "ది డిస్కవరీ అఫ్ ఇండియా "
(1946) రచించారు. ఈ రచనలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయనకు పెరుగుతున్న కీర్తితో
పాటు రచయితగా కొంత ప్రత్యేకతను సంపాదించి పెట్టాయి.గాంధీ గారి మార్గదర్శకత్వంలో నెహ్రూ
మొదటిసారిగా 1929 లో భారత జాతీయ కాంగ్రెస్, లాహోర్ సమావేశాలకు నాయకత్వం వహించారు. అయన
మరలా 1936, 1937 చివరిగా 1946 లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై స్వతంత్ర సంగ్రామంలో
గాంధీ తరువాత రెండవ నాయకునిగా గుర్తింపు పొందారు.[4] ఫిబ్రవరి 8, 1916 లో కాశ్మీరి
బ్రాహ్మణ వంశానికే చెందిన కమలా కౌల్ తో అయన వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఇందిరా
ప్రియదర్శిని పుట్టింది.[4] ఈమె తరువాత కాలంలో ఇందిరా గాంధీగా పిలువబడింది. కమలా నెహ్రూ
కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు కానీ 1936లో క్షయ వ్యాధితో మరణించారు.
నెహ్రూ తన శేష జీవితం మొత్తం ఒంటరిగానే గడిపారు. అయితే 1946 నుండి వైస్రాయి భార్యగా
నున్న ఎడ్విన మౌన్త్బట్టేన్తో అయన సంబంధం గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.
అయన తన తరువాత జీవితకాలంలో ఎక్కువగా తన కుమార్తె పైన మరియు సోదరి విజయలక్ష్మి పండిట్
పైన ఆధార పడ్డారు.
జ్ఞాపకార్ధం
తన జీవిత కాలంలో నెహ్రూ
భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా
గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు
రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి. బాలల మరియు యువజనుల
పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి
శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు
గుర్తుగా, ఆయన జన్మ దినమైన
14 నవంబర్, ను భారత దేశం
బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ
వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా
నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. కాంగ్రెస్
పార్టీకి చెందిన ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయనను తరచూ వారు
గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆయన
వస్త్ర ధారణను, ప్రత్యేకించిగాంధీ టోపీని మరియు అలవాట్లను అనుకరిస్తుంటారు.
నెహ్రూ ఆదర్శాలు మరియు విధానాలు కాంగ్రెస్
ప్రకటన పత్రము (ముసాయిదా)ను మరియు మూల
రాజకీయ తత్వాన్ని రూపొందించడంలో నేటికీ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆయన
వారసత్వ ప్రతినిధిగా ఇదిరా గాంధీ కాంగ్రెస్
పార్టీ మరియు ప్రభుత్వ నాయకత్వాన్ని
చేపట్టారు.
నెహ్రూ
జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో
కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు.
1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ
లోను, నెహ్రూ చే రచింపబడిన ది
డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథం
పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్
భారత్ ఏక్ ఖోజ్ లోను,
2007 లో ది లాస్ట్ డేస్
అఫ్ ది రాజ్ అనే
టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు
నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు
పరిపూర్ణత నిచ్చారు.[23] కేతన్ మెహతా చిత్రం
సర్దార్లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు.
శేర్వాని
ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం
దానిని ఉత్తర భారత దేశంలో
నేటికి కూడా ప్రత్యేక సందర్భ
వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి
ఆయన పేరును ఇవ్వడంతో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన
కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి
గౌరవిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు, జ్ఞాపక చిహ్నాలు
నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారత దేశంలోని విశ్వవిద్యాలయాలలో
ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ
విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో
నున్న జవహర్ లాల్ నెహ్రూ
పోర్ట్ భారీ సరుకు రవాణాకు,
రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్
మరియుడాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము
నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం మరియు గ్రంధాలయంగా సంరక్షించ
బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్
భవన్ మరియు స్వరాజ్ భవన్లు
నెహ్రూ జ్ఞాపకార్ధం మరియు కుటుంబ వారసత్వంగా
కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్
ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (AFSC)ద్వారానోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ
బడ్డారు.
![]() | |
| నోన్గ్పోలో పిల్లలకు మిఠాయిలు పంచుతున్న నెహ్రూ |
![]() |
జవహర్లాల్
నెహ్రూ జ్ఞాపకార్ధం 1989 లో
USSR విడుదల చేసిన తపాలా బిళ్ళ
|
![]() |
| జవాహర్ లాల్ నెహ్రూ, హైదరాబాదు అబిడ్స్ దగ్గరి విగ్రహము |
![]() |
| అల్ద్విచ్, లండన్ లో నెహ్రూ విగ్రహం |
Subscribe to:
Posts (Atom)







